BSNL: రూ.47 ప్రీపెయిడ్ ప్లాన్... 14GB డేటా... అదనపు బెనెఫిట్లు... పూర్తి వివరాలు ఇవీ...

 




మొబైల్ సర్వీస్ ఆపరేటర్లలో ఒకటైన BSNL మరో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తెచ్చింది. మరి దాని బెనెఫిట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

BSNL prepaid plan: ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)... సరికొత్త ప్రీపెయిన్ రీచార్చ్ కూపన్ తెచ్చింది. ప్రమోషనల్ ఆధారంగా కంపెనీ ఈ కూపన్ తెచ్చింది. దీని విలువ రూ.47. ఇది మార్చి 31, 2021 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఐతే... కంపెనీ చెప్పిన దాని ప్రకారం BSNL కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేదేంటే ఇతర మొబైల్ ఆపరేటర్ల నుంచి BSNLకి మారిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. అంటే కొత్త BSNL నంబర్‌కి మొదటి రీఛార్జ్ ఆఫర్ కింద ఇది వర్తిస్తుంది. అందువల్ల కొత్త సిమ్ తీసుకున్నా... ఆపరేటర్‌ని మార్చుకున్నా... BSNLకి వచ్చిన వారు ముందుగా ఈ కూపన్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

కొత్త కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడం కోసమే BSNL ఈ కొత్త కూపన్ తెచ్చింది. ఇది ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. ఎవరైనా 2 కూపన్లు కొనుక్కుంటే... మొదటి కూపన్‌కే ఆఫర్ వర్తిస్తుంది. కాబట్టి రెండో రీఛార్జి నుంచి కస్టమర్లు... కంపెనీ ఇస్తున్న రకరకాల రీచార్జ్ ఆఫర్లలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

Comments