Andhra Pradesh: కాసేపట్లో ఇస్రో పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం... మరో మైలురాయి దిశగా

 

ఇస్రో పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం..

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్, మొదటి సారి ఎన్ఎస్ఆయన్ కమర్షియల్ లాంచ్ ఇదే.

గతేడాది.. అంటే 2020 మొత్తం కరోనాపాలైంది. ఏడాది అంతే చేధు అనుభావాలే.. కరోనా మహమ్మారి ఇస్రో పైనా ప్రభావం చూపించింది. ఆ చేదు అనుభవాలను అధిగమించి 2021లో సరికొత్త అడుగులేసేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక వైపు చంద్రయాన్‌ –3, ఆదిత్య –ఎల్‌ 1, గగన్‌యాన్‌కు ఇలా వరస ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందు అడుగులు వేస్తోంది.

తాజా ప్రయోగం పీఎస్‌ఎల్వీ సీ – 51 ఉపగ్రహ వాహకనౌకను ఆదివారం ఉదయం 10.24కు కు నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి 25 గంటల ముందుగానే కౌంట్‌డౌన్‌ ప్రారంభమై కొనసాగుతోంది. అయితే ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్‌ దేశానికి చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా–01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం కావడం దీని ప్రత్యేకత.

Comments