నాటు సారా అక్రమ తరలింపు కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు కొందరు. అయినా పోలీసులకు దొరికిపోతుండడంతో ఇప్పుడు అధికారుల ముసుగులో బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే అంత తెలివిగా ప్లాన్ చేసిన పోలీసులకు చిక్కక తప్పలేదు.ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మధ్యం ఏరులై పారుతున్నా.. నాటు సారా జోరు కూడా తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణ, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం ఏపీకి చేరుతోంది. దీనికి తోడు నాటు సారా విక్రయాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీసులు తనిఖీలు చేస్తున్నా సారా వ్యాపారాలు అస్సలు తగ్గడం లేదు. అయితే అధికారుల కారుల్లోనే నాటు సారా సరఫరా అవుతుండడం కలకలం రేపుతోంది. కారుపై తహసీల్దారు స్టిక్కర్ ఉంటే పోలీసులు పట్టించుకోరు కాదా అనుకుని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది. అక్రమనాటు సారా తరలింపు గుట్టు రట్టు చేశారు పోలీసులు.ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ధరలను కూడా ఊహించని స్థాయిలో పెంచేసింది. మద్య నిషేదంలో భాగంగానే రేట్లు పెంచామని ప్రభుత్వం చెబుతోంది. రేట్లు భారీగా ఉంటే కొనేవారు తక్కువ అవుతారు కదా అన్నది ప్రభుత్వం వాదన. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద నిర్దేశించిన సమయాల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. అయితే దీనికితోడు ప్రభుత్వం విక్రయించే మద్యం షాపుల్లో మందుబాబులకు నచ్చిన బ్రాండ్లు దొరకడం లేదు. పేరులేని బ్రాండ్లు ఎక్కువగా ఉండడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో అటు వైపే ఆసక్తి కనపరుస్తున్నారు. అంతా డబ్బులు కూడా పెట్టలేని వారు నాటు సారాను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా సరిహద్దు మండలాల నుంచి భారీగా నాటు సారా సరఫరా అవుతోంది.విజయనగరం జిల్లాలో అక్రమంగా సరఫరా అవుతున్న నాటు సారాను పోలీసులు పట్టుకున్నారు. అయితే కొమరాడకు చెందిన తహసీల్దార్ ప్రసాద్ కి చెందిన కారులో నాటుసారా సరఫారా అవ్వడం కలకలం రేపుతోంది. బొబ్బిలిలో వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నాటుసారా పట్టుబడింది. ఆ వాహనంపై తహసీల్దార్ స్టిక్కర్ ఉండడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వెంటనే డ్రైవర్ దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ కారులో ఒడిశా నుంచి తరలిస్తున్న 260 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఎమ్మార్వోకు తెలియకుండా ఆయన కారును డ్రైవర్ ఇలా అక్రమ రవాణకు వాడుకుంటున్నాడా.. ఇంకెవరి హస్తమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ నాటు సారా తరలింపులో ఎమ్మార్వో పాత్ర ఏమైనా ఉందేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు బొబ్బిలి పోలీసులు.
మొన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇలా భారీగా నాటుసారా, అక్రమ మద్యం ఏరులై పారింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇలా అక్రమ నాటుసారా బిజినెస్ కు తెరలేపుతున్నారు. అయితే సరిహద్దులో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో వారినుంచి తప్పించుకోడానికే ఇలా అధికారుల వాహనాలను అడ్డుపెంటుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.
Comments
Post a Comment
thanks for comment