జియో యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌

jio phone 3 booking  jio recharge  jio phone booking  jio phone flipkart  jio phone price  jio touch phone 4g  jio phone 5g  jio phone price 2020  jio phone 3 booking  jio phone 3 flipkart jio phone flipkart jio phone price jio phone touch                                                                          


 జియో యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌

కొత్త జియో ఫోన్ కొనుగోలు చేసే యూజర్లకు, ఇప్పటికే జియోఫోన్ కలిగిఉన్న యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌ను రిలయన్స్ జియో తీసుకొచ్చింది. జియోఫోన్ 2021 ఆఫర్ కింద యూజర్లు రెండేళ్ల వరకు ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి నెల 2జీబీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థ జియో రూ.1999లతో జియో ఫోన్ కొనుగోలు చేస్తే 24 నెలల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ను ప్రతి రోజూ 2జీబీ డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్ ను ఎంచుకునే చందారులకు డేటా, అపరిమిత కాల్స్ సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇది ముఖ్యంగ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.

రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీనికోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు జియోఫోన్ తో పాటు 12 నెలల ఆన్ లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. అలాగే ఇప్పటికే జియోఫోన్ కలిగి ఉన్న వినియోదారుల కోసం మరో కొత్త ఆఫర్ ని ప్రకటించింది. ప్రతి నెల 2జీబీ డేటాతో పాటు, ఉచిత వాయిస్ కాల్స్ ను కేవలం రూ.749 అఫర్ ధరకే పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పుడు, రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. “భారతదేశం లో జియోకు 300 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారని వారికి డేటా సేవలు మరింత దగ్గరగా తీసుకుని వెళ్లడం కోసమే తమ ప్రయత్నమని చెప్పారు. అలాగే ప్రస్తుతం 2జీ, 3జీ ఫోన్ లు వాడుతున్న వారికి 4జీ  సేవలు అందించడమే తమ లక్ష్యమని" పేర్కొన్నారు.

Comments